Unstoppable Episode With Prabhas
| Balakrishna & Balakrishna |
Unstoppable :-
Nandamuri Balakrishna అఖండ సినిమాతో సక్సెస్ బాట ఎక్కాడు. అఖండ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతోంది. బాలయ్య బాక్సాఫీస్ దగ్గర తొడగొడితే ఇలా ఉంటుందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగే Unstoppable షో లో దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ అందరి థింకింగ్ మార్చేస్తున్నారు బాలయ్య. ఈ షో లో బాలయ్య గారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మొదటి ఎపిసోడ్ మోహన్ బాబు గారితో అదరగొట్టేశాడు. రెండవ ఎపిసోడ్ నాని గారితో ఒక ఆట ఆడుకున్నాడు. ఇక మూడవ ఎపిసోడ్ బ్రహ్మానందం గారితో అయితే చెప్పనవసరం లేదు. నాలుగో ఎపిసోడ్ అఖండ టీంతో ఇరగదీశాడు. తర్వాత ఎపిసోడ్ మహేష్ బాబుది స్ట్రీమింగ్ కానుంది.
# ఇది కూడా చదవండి:- బాలయ్య సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్.
ఇప్పుడు తర్వాత వచ్చే ఎపిసోడ్కి ఎవరు అని అందరూ ఆలోచనలో పడ్డారు. అందరి అంచనాలను తలకిందులు చేసే లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ షో కి రాబోతున్నాడు అని తెలుస్తోంది. అందుకు ప్రభాస్ గారిని ఒప్పించే కార్యక్రమాలు కూడా జరిగిపోయాయట. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఆహా టీం వెల్లడిస్తుంది అని చెబుతున్నారు. ఇప్పుడు ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

0 Comments