అఖండ సినిమా విజయోత్సవ వేడుక

Akhanda-Movie-Balakrishna
Akhanda Balakrishna 

Akhanda :-

      నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి చాలా కాలంగా సరైన హిట్ లేక అల్లాడిపోయిన ఫ్యాన్స్కు పంచభక్ష్య పరమాన్నం వడ్డించి నట్టుగా బోయపాటి, బాలయ్య అఖండతో వచ్చారు.  ఈ సినిమా ఫస్ట్ షో నుంచి హిట్ టాక్ ను సొంతం చేసుకొని తెలుగు రాష్ట్రాల్లోనూ,  ఓవర్సీస్లోనూ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతు రుద్ర తాండవం చేస్తుంది అఖండ.  

# ఇది కూడా చదవండి:- ఓవర్సీస్ లో ఏడు లక్షల డాలర్లు కొల్లగొట్టిన అఖండ.

     ఇంతటి ఘన విజయం అందుకున్న బాలయ్య మరియు దర్శకనిర్మాతలు ఈ అఖండ సినిమా విజయోత్సవ వేడుకను నిర్వహించాలని అనుకున్నారట. అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి చీఫ్ గెస్ట్ లుగా  వచ్చినట్లే ఈ విజయోత్సవ వేడుకకు కూడా ఇద్దరూ చీఫ్ గెస్ట్ లు రానున్నారని సమాచారం. 

# ఇది కూడా చదవండి:- నాగేశ్వరరావు ను ఇమిటేట్ చేసిన బాలయ్య, అదిరిపోయింది.

Balakrishna-mahesh-babu-jr-ntr
Balakrishna 

       మరి అది ఎవరో కాదు టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు.  ఈ విషయం పై చిత్రబృందం అధికారికంగా ప్రకటించవలసి ఉంది.  అఖండ ప్రీ రిలీజ్ వేడుక నాడు బాలయ్య గారి గురించి అల్లుఅర్జున్ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.  ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు బాలయ్య గారి గురించి మాట్లాడిన మాటలు ఇది వరకే మనం విన్నాం. ఇక మహేష్ బాబు గారు బాలయ్య గారు గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అని నందమూరి అభిమానులు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.