What every one thinks about in the last moments of dying,
How is every person last moments
చనిపోయే చివరి క్షణాల్లో ప్రతి ఒక్కరు ఏమి ఆలోచిస్తారు, ప్రతి వ్యక్తి చివరి క్షణాలు ఎలా ఉంటాయి
SOUL |
1. చనిపోయే సమయంలో
ప్రతి ఒక్కరు దుఃఖంతో నే చనిపోతారు ఎందుకు?
2. దేవుడంటే నమ్మకం ఉన్నవాడు,
కానీ లేనివాడు కానీ తన చివరి క్షణాల్లో ఆ దేవుడిని ఒక్కటే
కోరుకుంటాడు అది ఏమిటి?
3. నీకు ఎవ్వరూ చెప్పలేనిది, ఎవరో ఒకరు
చెప్పాలనుకున్న తన జీవితం సమయం ఇవ్వలేనిది. నేను చెబుతున్నా విను, వినడం నీ
చెవులతో కాదు కళ్ళు మూసుకొని నీ మనసుతో విను
4. ఇది తెలుసుకొని నువ్వు ఆచరిస్తే నీ చివరి
క్షణాలు బాధతో కాదు ఆనందంతో ముగిసిపోతాయి.
5. మనిషి చివరి క్షణాల్లో తన జీవితంలో తను చేసిన
తప్పులన్నీ గుర్తుకొచ్చి తన తప్పులు సరిదిద్దు కోలేనివి అయినప్పటికీ
సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వమని ఆ దేవుని ప్రాధేయ పడతారు, ఆ తప్పు ఏమిటో
తెలుసా?
6. ప్రపంచంలో నేనే గొప్ప వ్యక్తి అనుకున్నా ఏ వ్యక్తి అయినా తన
చివరి క్షణాల్లో ఏ పాఠం నేర్చుకుటాడో మీరు
తెలుసుకోండి.
దేవుడా ఇక్కడికి
నన్ను ఏదో ఒక గొప్ప కార్యం చేయమని పంపావు కానీ నేనేం చేశాను
A. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నేనేం
చేశాను
B. నాకు చదువు
చెప్పిన నా ఉపాధ్యాయులకు నేనేం చేశాను
C. నన్ను ఆనందింప
చేయడానికి, నాకు జ్ఞానోదయం కలిగిండానికి, చందమామ కతలు చెప్పి నన్ను జోల పాడి
నిద్రపుచ్చిన నా తల్లిదండ్రులను కన్న ఆ తల్లిదండ్రులకు నేను ఏమి చేశాను,
D. నా జీవితంలో నేను ఎదగడానికి నాకు
విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు నేను ఏమి చేశాను,
E . నా చిన్ననాడు
సైకిల్ నేర్చుకుంటూ కింద పడి ఇది నాకు రాదు అని నా పరాజయాన్ని ఒప్పుకొని నేను
తలవంచితే, నేను ఉన్నాను నీకు నేను నేర్పిస్తాను అని నాకు సైకిల్ నేర్పించిన నా
స్నేహితునికి నేనేం చేశాను,
F. నాకు ఆరోగ్యం
బాగాలేక మంచాన పడితే నా బిడ్డకు ఏమైందో అని నా తల్లిదండ్రులు బాధపడుతుంటే నాకు
వైద్యం చేసి నా తల్లిదండ్రుల
బాధ తీర్చిన ఆ వైద్యులు గారికి నేనేం చేశాను,
G. ఆకలేస్తే అమ్మ అంటూనే నా తల్లి నా నోటికి గోరుముద్దలు
అందించింది అనుకున్నానేగానీ, ఆ గోరుముద్దలు పండించిన రైతుకు నేనేం చేశాను,
H. దారిలో నడుస్తూ
అడుగు తడబడి కింద పడినప్పుడు చిన్న, పెద్ద, ముసలి, ముతక, వారు, వీరు అని అందరూ నా
చుట్టూ చేరి ఏమి నాయనా చూసుకొని నడువు జాగ్రత్త నాయనా అని నా బాగోగులు కోరుకున్న
వారికి నేనేం చేశాను,
I. గొప్ప గొప్ప
చదువులు చదివాను చదువులేని వారికి అంటే నేను ఎంతో గొప్ప వాడిని అని మురిసిపోయానే
కానీ చదువు లేని వారికి ఉన్న సంస్కారం, నాకెప్పుడూ లేదని
నేను గుర్తించలేక నా చదువుకు ఉన్న విలువను
తగ్గించుకున్నా వెరీ వాడడానని నా కలలో
కూడా నేను గుర్తించలేక ఆచదువుకు నేను ఏమి చేశాను.
J. నేను వ్యాపారం చేసి కోట్లు గడించిన అప్పుడు నా వ్యాపారం
విజయవంతం కావడానికి కారణమైన నా గ్రామ ప్రజలకు నేనేం చేశాను,
K. నా జీవితానికి తోడొచ్చిన నా మామగారిని కట్నం అని పిండిoచనే తప్పా, తన బిడ్డను ఇచ్చి
నా వెన్ను తట్టి ముందుకు నడిపిన నా అత్తామామగారికి నేనేం చేశాను
L. ముసలి ప్రాయంలో
ఉన్న నా తల్లిదండ్రులను నేను చూసుకోవడానికి బరువై, మీరు ఎప్పుడు పోతారు ఆస్తి నా చేతికి ఎప్పుడు
వస్తుందా అని ఎదురు చూశానే,
కానీ ఆస్తి కంటే
విలువైన జీవితాన్ని నాకు ఇచ్చారు అని నేనెప్పుడూ అనుకోలేకపోయాను.
M. పరాయి స్త్రీల మోజులో పడి నా భార్యను నిర్లక్ష్యం
చేసినానే తప్పా, తాళి కట్టిన నుండి సచ్చేదాక నేనే దైవం అనుకున్న
నా భార్యకు నేనేం చేశాను,
N. ధనమే ముఖ్యం వ్యాపారంలో మనము ఎదగడమే ముఖ్యం ఎవరైనా గాని మన
తలదన్నే వ్యాపారులు వస్తే వారిని ఎలాగైనా నేలపాలు చేయాల్సిందే అని నేను పదే పదే
పదే పదే నా పుత్రులకు చెప్పానే తప్ప,
ఇతరులు లేనిదే మనము లేము ఇతరులు బాగుంటేనే మనం బాగుంటం అని ఒక్క మాట కూడా నా కడుపున పుట్టిన బిడ్డలకు
నేను చెప్పలేకపోయానే నా బిడ్డలకు నేనేం చేశాను,
O. నా పాదం కందకుండా చెప్పులు తొడిగిన వాడికి నేనేం చేశాను, నా ఒంటికి అందమైన
దుస్తులు తయారు చేసిన వాడికి ఏమి చేశాను, ఇలా చెప్పుకుంటూ
పోతే ఒకరా ఇద్దరా వందలు వేలు లక్షల మందికి నేనేం చేశాను
P. అది నాది ఇది నాది నేనే బతకాలి నేనే బతకాలి నేను
మాత్రమే బతకాలి ఎవడు ఎటు పోయినా నాకు అనవసరం అనవసరం అనవసరం అని అసూయ ద్వేషాలతో
జీవితాన్ని జీవించానే కానీ ఇన్ని ఇచ్చిన
నా తోటి వారికి నేనేమి ఇచ్చాను
Q. నేను చెప్పిన తప్పుడు మాటలు నమ్మి సమాజ అభివృద్ధి కోసం
నాకు అధికారాన్ని కట్టబెట్టిన నా ప్రజలకు నేనేం చేశాను
R. నా అధికార బలంతో అందరికీ దాహాన్ని తీర్చే తల్లి లాంటి చెరువులను పూడ్చానే, నా ధన దాహంతో లక్షల
మందికి లక్షల సంవత్సరాలు ఉపయోగపడే అడవునే
నరికించానే నా రాజకీయ చతురతతో నేను గొప్ప జ్ఞానవంతున్ని అనుకున్నానే కానీ
అజ్ఞానంలో కొట్టుకుంటున్న అజ్ఞానినని గ్రహించలేక పోయా.
S. నేను సచ్చక నా ప్రతిమలు ఇంటింటా నా విగ్రహాలు ఊరూరా ఉంటాయని
ముందే నేను భవిష్యత్తునూ అంచనా వేశానే కానీ ఒక్క పైసా
కూడా వాటి వల్ల ఇతరులకు ఏ ఉపయోగం ఉంటుందని,
నా చేతులారా ఒక చెట్టు నైనా ఈ భూమి మీద నాటిన
కూడా కొన్ని వందల సంవత్సరాలు ఎంతోమందికి ఉపయోగపడేది అని ఏ మాత్రం కూడా
భవిష్యత్తులో నా జ్ఞాపకాలు ఇతరులకు ఉపయోగపడాలి
అని ఏ చిన్న ప్రయత్నం కూడా నేను చేయలేదే
T. దేవుడా! నాకు ఇక్కడ
జీవించడానికి ఏమి అర్హత ఇచ్చావో నా చుట్టూ
ఉన్న పశుపక్ష్యాదులు కూడా అలాంటి అర్హత ఇచ్చావు అని నేను ఎందుకయ్యా నేను
తెలుసుకోలేక పోయాను.
H. ధనిక పేద కులం మతం అని మనుషులందరినీ విభజించి
బేదాలు చూశానే. కానీ నేను మనిషిగా పుట్టాను
మనిషిగా చస్తాను నా జాతి మనిషి జాతి, మనుషులందరూ ఒక్కటే అని తెలుసుకోలేక ఇన్ని
రోజులు పిచ్చివాడిగా జీవించానే.
U. నా జీవితమంతా తన
ఒడిలో అల్లారు ముద్దుగా ఆడించుకున్నా సమస్త జనులను కన్న ఈ జన్మభూమి కి నేను ఏమి
చేశాను,
ఎంతో అమూల్యమైన ఈ జీవితానికి చీపురు పుల్ల అంత విలువ కూడా లేకుండా చేసుకున్న,
ఈ ప్రపంచంలో నేను అందరి కంటే గొప్ప వాడిని అనుకున్నానేగానీ
నాకు ఇప్పుడే తెలుస్తుంది నేను అందరికంటే అధముడను అని.
What every one thinks about in the last moments of dying |
ప్రతిఒక్కరి ఆత్మ చివరి క్షణాల్లో ఇంతకంటే ఎక్కువగానే బాధపడుతుంది. మీ చివరిక్షనాలు ఆనందంతో ముగిసిపోవాలంటే ఈ భూమి మీద ఉన్నంతకాలం ధర్మం పాటించండి.
ఇట్లు,
మీ ఆత్మబందువు.
0 Comments