Akhanda Movie Collections 



Akhanda-Movie-Collections-|-Balakrishna-|-Akhanda-Movie
Balakrishna 


 Akhanda Collections :-

       ఊర మాస్ హీరో ఊర మాస్ డైరెక్టర్ కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నెల 2వ తేదీన విడుదలైన అఖండ సినిమా ఇప్పటికి హౌస్ఫుల్ కలెక్షన్లతో నే కొనసాగుతూ ఉంది. నాలుగవ రోజు కూడా హౌస్ఫుల్ బోర్డ్స్  దర్శనమిస్తున్నాయి అంటే ఇంకెన్ని కొత్త రికార్డ్స్ కయేట్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అఖండ ఓవర్సీస్ లో కూడా అఖండమైన విజయం తో సాగిపోతోంది. ఒక మాస్ సినిమాకు  ఓవర్సీస్లో ఇంత పెద్ద రెస్పాన్స్ రావడం అనేది ఆశ్చర్యమే అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. ఇప్పటికే ఓవర్సీస్లో ఏడు లక్షల డాలర్లను వసూలు చేసింది అఖండ. అఖండ లాంగ్ కన్నులు రెండు మిలియన్ల డాలర్ల వరకు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

Akhanda-Movie-Collections-|-Balakrishna-|-Akhanda-Movie
Balakrishna 

# ఇది కూడా చదవండి:-  అఖండ సినిమా చూడడానికిిచూడడానికి వచ్చిన అఘోరాలు.

      ఈ సినిమా మొదటి రోజే 30 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు కాబట్టి ఏదో వసూళ్లు వచ్చాయి రెండో రోజు దారుణంగా పడిపోతాయి అన్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ముక్కున వేలేసుకునేట్లు 22 కోట్లకు పైగా వసూలు చేసి అలా మాట్లాడిన వాళ్లు ముక్కున వేలేసుకుని విధంగా వసూళ్లు రాబట్టింది అఖండ. ఏదో ఒకటి రెండు రోజులు అలా వచ్చాయి మూడో రోజు థియేటర్ల మొహం కూడా చూడరు అన్న వాళ్ళ చెంప పగలగొట్టే విధంగా18 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు వసూళ్లు ఊచకోత సాగిస్తోంది. ఇక ఇవాళ ఆదివారం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టి అవకాశం ఉంది అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎంత లేదన్నా నాలుగవ రోజు ముగిసే సరికి 100 కోట్ల పైగా నే రాబట్టే అవకాశం ఉందంటున్నారు.

# ఇది కూడా చదవండి:- ANR ను ఇమిటేట్ చేసిన ఎన్.బి.కె. అదిరిపోయింది.