NBK107 Movie Update | Balakrishna

 బాలయ్య సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్

Nbk107-movie-update-nandamuri-balakrishna-arjun
Balakrishna & arjun 


NBK107:-

చాలా రోజులుగా సరైన హిట్ లేక సతమతం అయిన బాలయ్య అఖండ తో మళ్లీ సక్సెస్ బాట ఎక్కాడు. అఖండ సినిమాతో బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టుకున్నాడు. ఇక తదుపరి సినిమా గోపీచంద్ మలినేని తో తెరకెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు.  ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగిపోయాయి.  ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటించడం జరుగుతుందట.  ఫ్యాక్షన్ నేపధ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

# ఇది కూడా చదవండి:- హిందీ లో భారీ ధరకు అమ్ముడుపోయిన అఖండ హక్కులు

 కాగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నాడని తాజాగా వార్తలు వస్తున్నాయి.  అది కీలక పాత్రనా లేక విలన్ పాత్రనా అనే దానిపైన అనుమానాలు అయితే సాగుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో నటించడం సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతుoది .  ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుందని అంటున్నారు. 



# ఇది కూడా చదవండి:- Unstoppable Episode 4 Promo అదిరిపోయింది.





Post a Comment

0 Comments