Akhanda Hindi Rights In Telugu | Balakrishna

 Akhanda Hindi Rights

Akhanda-Hindi-Rights-In-Telugu-|-Balakrishna

Akhanda :-
     ఇప్పుడు ఎక్కడ చూసినా అఖండ సినిమా పైనే చర్చ. ఎన్ని థియేటర్లలో రిలీజ్ అయింది, ఈ సినిమా ఫస్ట్ టాక్ ఎలా ఉంది, సెకండ్ టాక్ ఎలా ఉంది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత, సెకండ్ డే కలెక్షన్స్ ఎంత ఇలా అనేక విధాలుగా అఖండ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా చర్చ నడుస్తోంది.  


        ఈ సినిమా విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ ను సొంతం చేసుకొని అఖండ విజయంతో దూసుకుపోతోంది.  ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల పంట పండిస్తోంది. బాలయ్య అభిమానులకు మరో శుభవార్త ఏమిటంటే ఈ సినిమాకు మరో 20 కోట్ల రూపాయలు లాభం వచ్చింది. 


       అఖండ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ బాలకృష్ణ గారి కెరీర్లోనే అత్యధిక రేటుకు అమ్ముడు పోయాయట. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులకు ప్రముఖ పంపిణీ సంస్థ అఖండ నిర్మాతకు 20 కోట్ల రూపాయలు చెల్లించిoదని తెలుస్తోంది.  అఖండ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కాకుండా 20 కోట్ల రూపాయలు నిర్మాతకు అదనపు ఆదాయం. 
 ఇక విడుదలైన అన్ని ఏరియాల్లో అఖండ లాభాల పంట పండుతుందని అంటున్నారు. 



Post a Comment

0 Comments