ఆ ఏరియాలో అఖండ బ్రేక్ ఈవెన్ క్రాస్ 

Akhanda-Break-Even-Cross-In-Nizam-In-Telugu
Balakrishna 
 

Akhanda :-

         బోయపాటి శ్రీను, Nandamuri Balakrishna 18 నెలలు కష్టపడి తెరకెక్కించిన చిత్రం అఖండ. ఈ చిత్రంపై నందమూరి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే సినీ విమర్శకుల నుండి నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. రెండవ రోజు మూడోరోజు థియేటర్లో మొహం కూడా చూడరు అన్న వాళ్లు కూడా ఉన్నారు. 


       కానీ అఖండ విజయానికి అవేమీ అడ్డుగా నిలవలేక పోయాయి.  విడుదలైన అన్ని ఏరియాలో కళ్లు చెదిరే కలెక్షన్లతో అఖండ విజయ ఢంకా మోగిస్తోంది.  ఇక నైజాం ఏరియాలో అయితే అఖండ విజయానికి తిరుగులేకుండా పోయింది.  బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల పంట పండిస్తోంది.  


          నైజాం ఏరియాలో మొదటిరోజు 4.4 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, రెండవ రోజు 2.2 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఇక మూడవ రోజు అయితే 3 కోట్ల షేర్ సాధించి రెండవ రోజును మించిన వసూళ్లు సాధించిందని చెప్పవచ్చు.  నాలుగో రోజు ఆదివారం కావడంతో ఎంత లేదన్నా మూడు కోట్లపైగానే వసూలు సాధించింది అంటున్నారు ట్రేడ్ వర్గాలు.  నైజాం ఏరియా కు 12 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో అఖండ బ్రేక్ ఈవెన్ క్రాస్చేసి లాభాల పంట పండించడం జరుగుతోంది. mokshagna teja