This poetry is dedicated to every soldier on the occasion of independence day | Teluguonlineexamcenter

Happy Independence day

This poetry is dedicated to every soldier on the occasion of independence day. In this poem, the Indian soldiers are greatly described in the context of independence day. This poetry is dedicated to every soldier from the people of our country.

Happy-independence-day-telugu-online-exam-center
Happy Independence day
సైనికుడా నీ జన్మ ఉత్తమం, నీ జీవితం మొత్తం, నీ మరణం ఉత్తమం.

నా జన్మ భూమే నా తల్లి,  దేశమే నా ఇల్లు,  దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు అనుకున్న సైనికుడా నీకు వందనం

 కోట్ల మంది ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీ నిద్రను దూరం చేసుకున్నావ్ 

 కోట్ల మంది తమ కుటుంబంతో ఆనందంగా జీవించడానికి నీ కుటుంబానికి దూరం అవుతావ్ 

కోట్ల మంది సంతోషంగా జీవించడానికి నీ జీవితాన్ని సంతోషంగా త్యాగం చేస్తున్న సైనికుడా నీకు వందనం

నా కులం అంటూ నా మతం అంటూ సరిహద్దులు తీసుకుంటున్న కొందరికి,  నాకంటూ హద్దుల్లేవు మీ అందరి రక్షణ బాధ్యత అంటున్న సైనికుడా నీకు వందనం

ఆహా ఏమి నీ అదృష్టము, నీవు సరిహద్దున లేనిదే రాజ్యాన్ని ఏలే రాజు అయినా, రాజే తన దైవం అనుకున్న బంటు  అయినా కంటి నిండా నిద్ర పోలేరే

దేశం కోసం కానీ, తన వారు కానీ వారి కోసం కానీ ప్రాణాలు ఇచ్చే వారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు సైనికుడు

 ఏ నాయకుడు మరణించిన, ఏ వ్యాపారవేత్త మరణించిన, ఏ సినీనటుడు మరణించిన కొన్ని ప్రాంతాలకో, కొన్ని వర్గాలకో, కొంతమందికి మాత్రమే కన్నీళ్ళ రూపంలో పరిమితమౌతారు.
     అదే ఒక సైనికుడు వీర మరణం పొందినప్పుడు ముక్కు ముఖం తెలియకపోయినా,  ఊరు పేరు తెలియకపోయినా దేశ ప్రజల హృదయాలు తల్లడిల్లిపోయాయి. ఇంతటి ప్రేమాభిమానాలను ఎవరు పొందగలరు ఒక సైనికుడు తప్ప

లోకానికే రక్షకుడైన రక్షకుని కే రక్షకునిగా ఉంటావే ఆహా ఏమి నీ అదృష్టం

నీ కుటుంబం గడవడానికి నువ్వు పైకం తీసుకుంటావే కానీ నీ సేవకు పైకం వెలకట్టగలమా

నీ విలువ తెలియని వారికి కానీ, తెలుసుకోలేని వారికి  కానీ, దేశం విలువ, తల్లి విలువ ఏమి  తెలుస్తుంది సైనికుడా

ఎంతోమంది తల్లులు తన ఒడిలో లాలిస్తున్న భరతమాతకు  రక్షణగా నిలబడిన సైనికుడా నిన్ను కన్న నీ తల్లి భరతమాత కే తల్లి వంటిది,  ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఏ కొడుకు ఏ తల్లికి తెచ్చి ఇవ్వగలడు  సైనికుడా ఒక్క సైనికుడా తప్ప

ఇంతటి ఘనమైన నీ కీర్తి మాటల్లో వివరించలేనిది అయినప్పటికీ ఏదో చిన్న ఉడతాభక్తిగా వర్ణించడానికి ప్రయత్నించిన ఈ జీవితాన్ని ఇచ్చిన లోకరక్షకుడికి  ఈ జీవితాన్ని కాపాడుతున్న సైనికుడా వందనం మీకు కోట్లాది వందనాలు.





Happy Independence day-Telugu Online exam center
Happy Independence day



Post a Comment

0 Comments