మీ ఆలోచన విధానాన్ని మార్చే బెస్ట్ మోటివేషనల్ స్టోరీ
The best motivational story that changes your thinking |
ఒక తండ్రి తన కొడుకుని ఎప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు అనే తిడుతు ఉండేవాడు. ఒక రోజు ఏ పని చెయ్యవు, నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేయాలి, అప్పుడు నీకు ఆకలి విలువ తెలుస్తుంది అని ఇంటి నుండి వెళ్లగొట్టాడు. ఆ అబ్బాయి నేను ఎందుకు పనికిరాను, నేను బతకడం అనవసరం అని చనిపోతామని బయలుదేరాడు. అలా వెళ్తూ ఉండగా అతడు ఒక రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజ్యంలో కొంతమంది అతనిని చూచి ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. అతను ఏమి ఇక్కడికి రాకూడదా అని అన్నాడు? ఆ రాజ్యంలోని ప్రజలు ఇలా అన్నారు.
ఇది సుందర వనం అనే ఒక అద్భుతమైన రాజ్యం ఇక్కడ ప్రజలు చాలా ఆనందంగా,సిరిసంపదలతో జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు అనుకోకుండా ఈ రాజ్యంలో ఎక్కడపడితే అక్కడ చాలామంది చనిపోయి ఉన్నారు. రాజు గారికి ఈ విషయం తెలిసి విచారించాలని సైనికులనున పంపాడు ఇక్కడికి వచ్చి సైనికులు పరిశీలిస్తూ ఉండగా ఒక పెద్ద రాక్షసి వచ్చి సైనికుల పై విరుచుకుపడింది, సైనికులతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలను కూడా చంపడం ప్రారంభించింది.
Ghost image |
అది చూసిన ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎవరి ఇళ్లకు వారు వెళ్లి దాక్కున్నారు. అప్పటినుండి ఆ రాక్షసి రాజ్యాన్ని మొత్తం అల్లకల్లోలం చేయసాగింది. రాజుకు ఆ రాక్షసి బారినుండి రాజ్యాన్ని ఎలా కాపాడాలో అర్థం కాలేదు. ఎవరైతే ఆ రాక్షసుడిని చంపుతారో వారికి సగం రాజ్యాన్ని ఇచ్చి తన కూతురితో పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు. అయినా కూడా ఆ రాక్షసున్ని చంపడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. అందుకే చెబుతున్నా ఇక్కడి నుంచి వెళ్లి మీ ప్రాణాలు కాపాడుకోండి. రాక్షసి ఎప్పుడు వస్తుందో తెలియదు చూస్తే అందర్నీ చంపేస్తుంది, అని ఆ యువకుడికి సలహా ఇచ్చారు. అందుకు ఆ యువకుడు ఇలా అన్నాడు,
మనం ఎందుకు దానికి భయపడాలి, మనం అందరం దాని పై దాడి చేసి దాన్ని ఎందుకు చంపలేము అన్నాడు. ఆ రాజ్య ప్రజలు చంపడానికి అదేమన్నా చిన్న రాక్షసా, చాలా పెద్దది. దాని దేహం కొండంత ఉంటుంది, అది వరుసబెట్టి ఎంతమందినైనా చంపగలదు అని అన్నారు. అందుకు ఆ యువకుడు అలా ఎందుకు ఆలోచించాలి, అంత భారీ దేహం అయినప్పుడు మనం కొడితే తప్పించుకోలేని దేహం తనది. రాజ్యంలోని ప్రజలు అందరూ ఒకేసారి దాడి చేస్తే అది ఎక్కడికి వెళ్లి దాక్కోలేదు. "చెట్టుపై ఉన్న చిన్న పక్షి ని కొట్టడం కష్టం కానీ చెట్టును చాలా సులభంగా కొట్టొచ్చు" కదా అని అన్నాడు.
Elephant and rat |
అతని ఆలోచన విధానానికి ఆ రాజ్య ప్రజలు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రాక్షసి రాగానే అందరూ ఒక్కసారిగా అన్ని వైపుల నుండి దాడి ప్రారంభించారు, అది ఏమాత్రం ఆ దాడి నుండి తప్పించుకోలేక పోయింది, ప్రజలందరూ ఆ రాక్షసిని చాలా సులభంగా చంపేయ గలిగారు. ఆ యువకుడి ఆలోచన తీరు, తెలివితేటలు నచ్చి, తను మాట ఇచ్చిన ప్రకారం సగం రాజ్యాన్ని ఇచ్చి, తన కూతురితో పెళ్లి చేశాడు రాజు.
Chess |
చూడండి ఫ్రెండ్స్ ఈ కథలో నేను ఎందుకు పనికిరాను చనిపోవాలి అనుకున్నా ఒక యువకుడు, ఒక ఉన్నతమైన ఆలోచనతో ఒక రాజ్యానికి రాజు కాగలిగాడు. ఒక సమస్య వచ్చినప్పుడు పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు. అందరూ ఒకే రకంగా ఆలోచించరు. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఒకే విధంగా ఆలోచించకుండా, పది రకాలుగా ఆలోచించు, ఏదో ఒక ఆలోచన నిన్ను ఆ సమస్య నుండి కాపాడుతుంది. అంతేగాని సమస్యకు భయపడి దాక్కోవడం, ప్రాణాలు తీసుకోవడం చాలా తప్పు.
Think different |
ప్రతి ఒక్కరూ తనకున్న సమస్యలను జయించ గలిగే శక్తి సామర్థ్యాలు ఆ దేవుడు మన అందరికీ ఇచ్చాడు. ఆ శక్తిసామర్థ్యాల ముందు ఏ సమస్య అయినా చాలా చాలా చాలా చాలా చిన్నది.
నా ఆప్త మిత్రులారా ఇప్పటి నుండి మీరు ఏ సమస్యనైనా జయిస్తారు అనే నమ్మకంతో సెలవు తీసుకుంటున్నా.
ఈ ఆర్టికల్ పై మీకున్న అభిప్రాయాలను కామెంట్స్ లో తప్పకుండ తెలియజేస్తారని కోరుకుంటున్నాను
0 Comments