Best Motivational story No 1

                                   మనకున్న బలహీనతలను మన బలంగా మార్చుకోవడం ఎలా ?

inspirational stories, winner stories



                                                         ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతను వారి బలంగా మర్చుకున్ననాడు ప్రతిఒక్కరు విజయం సాదించగలరు. అది ఎలాగో ఈ కథలో మనం తెలుసుకుందాం

                                                              ఎవరైనా విజయం సాదించినప్పుడు వారి ప్రెండ్స్ ఏమంటారంటే  నీకేం బాబాయ్ ఆ దేవుడు అన్ని ఇచ్చాడు నాకే ఏమి ఇవ్వలేదు , నా బతుకంతే, నా కర్మ ఇలాగే తగలడింది అని అర్ధం పర్ధం లేని సాకులు చెప్తూ , దేవున్ని నిందిస్తూ బాదపడుతూ కాలాన్ని గడిపేస్తుంటారు. కానీ ఆత్మవిశ్వాసం నేను సాదించాలి అనే పట్టుదల ఉన్నవారు మాత్రం వారికీ కలిగిన అపజయాలకు తండ్రినో, తాతనో, వాడనో, వీడనో అనవసరమైన సాకులు చెప్పకుండా వారిలో ఉన్న బలహేనతలనే వారి బలంగా మార్చుకోగలరు. అది ఎలాగో నేను ఒక కథ చెప్తా అది విన్నాక మీలోని బలహీనతలను మీ బలంగా మార్చుకోగలరు అనే నమ్మకం నాకుంది ఇది నమ్మడం మీ బలం నమ్మకపోవడం మీ బలహీనత.

                                                               ఒక ఊరిలో ఒక బలవంతుడు ఉండేవాడు. వాడికివున్న బలాన్ని చూసి వాడు విర్రవీగుతూ ఉండేవాడు, అందరికి సవాల్ విసురుతుండేవాడు, ఆ ఊరిలో నన్ను ఓడించే మగాడే లేడు అని వికృత ఆనదం పొందేవాడు, అందరిని అవమానించేవాడు. చాలామంది వాడి పొగరు అనచాలనుకున్నారు, కానీ వాడి దగ్గరకు వెళ్ళగానే వాడి దేహాన్ని చూడగానే, వాడి కఠినమైన మాటలు వినగానే అందరికి చమటలు పట్టేవి. అది చూసి ఆ బలవంతుడు ఇంకా రెచ్చిపోయేవాడు.

                                                          ఒక రోజు ఒక యువకుడు వాడిని ఓడించి వాడి పొగరును చంపేయాలి అనుకున్నాడు. ఆ యువకుడు ఆ బలవంతుని దగ్గరకు వెళ్లి నీతో పోరాటానికి నేను సిద్దం నువ్వు సిద్దంగా ఉన్నావా  అన్నాడు. అక్కడ ఉన్నా కొంతమంది ప్రజలు అది చూసి ఆశ్చర్యపోయారు. ఆ బలవంతుడు ఇలా అన్నాడు, ఇవ్వాలా నీ సమయం బాగుంది నేను మంచి ఆనందంలో ఉన్నాను, పోయి నీ ప్రాణాలు కాపాడుకో అని స్వీట్ వార్నింగ్  ఇచ్చాడు .

( ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపడింది, ఆ బలవంతుడు అహంతో కూడిన జాలి చూపించింది ఎందుకనుకుంటున్నారు "అతను ఒక అవిటివాడు అతని కాలికి పోలియో సోకి సచ్చుపడిపోయింది " )

                                         ఆ యువకుడు ఇలా అన్నాడు,   అయితే అన్నా ఇవాళ నుంచి నన్ను ఓడించే మగడేలేడు అనే అహం ఉంది కదా దాన్ని ఓడిలేయ్ నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. దానికి ఆ బలవంతుడు ఒప్పుకోలేదు. కొద్దిక్షనాల్లోనే ఈ వార్త ఆ ఊరి ప్రజలందరికి తెలిసి చాలామంది అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఉన్నవారిలో కొంతమంది ఇలా అనుకుంటున్నారు, మాకు కాళ్ళు, చేతులు అన్ని బాగానే ఉన్నా ఆ బలవంతునితో గొడవెందుకు అని ఓరికనే ఉన్నాం,  వీడు ఆ పోలియో సోకినా కాలితో నిలబడడమే కష్టం అలాంటిది ఆ బలవంతునితో గొడవా, వాడు ఆ రెండో కాలు కూడా  విరకొట్టేస్తాడు  అని ఒకరు, వాడికి పిచ్చిపట్టిందని మరొకరు ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు .

                                     ఆ యువకుడు వెన్నక్కి తగ్గకపోయే సరికి ఇద్దరిమద్య బీకర పోరాటం ప్రారంభం అయినది. అక్కడ ఉన్నవారందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు, ఆ పోరాటం చాలా సేపు జారుతూ ఉంది చివరకు బలవంతుడు ఓడిపోయాడు. ఒక అవిటి వాడి చేతిలో ఓడిపోయినందుకు, సిగ్గుతో తలదించుకొని సచ్చిన అహాన్ని వదిలి, అక్కడనుండి వెళ్ళిపోయాడు.   తరువాత ఈ విషయం ఒక పెద్దాయనకు తెలిసి ఈ విజయం ఎలా సాద్యమైందని ఆ యువకున్ని అడిగాడు . దానికి ఆ యువకుడు ఇలా అన్నాడు.

                                                           అక్కడ ఉన్నవారందరూ ఆ పోలియో సోకిన కాలితో నిలబడడమే  కష్టం అలాంటిది వాడితో గొడవా అని ఎగతాళి చేసారు. కానీ ఆ పోరాటంలో ఆ బలవంతుడు నాకు కొట్టే దెబ్బలకు  ఆ పోలియో సోకిన కాలినే అడ్డుపెడుతూ వచ్చాను ఆ కాలు సచ్చుపడిపోయ్ ఉండడంవల్ల నాకు పెద్దగా బాదనిపించలేదు, నకు సమయం దొరికినప్పుడు వాడిపై పిడుగుద్దులు గుద్దాను, అంతే విజయం నాసొంతం అయిపోయింది అన్నాడు .  ఆ పెద్దాయన అది విని ఆశ్చర్యపోయాడు.

                                                   చూడండి ప్రెండ్స్ గెలవాలనే సంకల్పం, గెలవగలను అనే ఆత్మవిశ్వాసం ఉంటే మీకు ఎన్ని బలహీనతలు ఉన్నా చివరకు అవే మీ బలంగా మారుతాయి .

    

Post a Comment

0 Comments